పరకాల పట్టణంలో క్రైస్తవుల భారీ ర్యాలీ
పరకాల నేటిధాత్రి
శనివారం రోజున హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో సిఎస్ఐ సంస్థను స్థాపించి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా శత సంవత్సరాల వేడుకలు పరకాల అంబేద్కర్ సెంటర్ నుండి బస్టాండ్ కూడలి వద్దకు సంఘం క్రైస్తవులు భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది.ఈ ర్యాలీలో కరీంనగర్ అధ్యక్ష మండలం పీటాధిపతులు రెవరెండ్ రూబెన్ మార్క్ బిషప్ పాల్గొని పాటలతో డ్యాన్సులు వేస్తూ సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నో ఏండ్ల నుండి నడిపిస్తున్న సంస్థ స్థాపించిన కాలం నుండి నేటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిందని,పాఠశాలలు స్థాపించి ఎంతోమంది ఉన్నత విద్యను అందించి వారు ఉన్నత స్థాయిలో నిలిచేందుకు తొడ్పడిందని,వృద్దులకు, వితంతువులకు,అనాధ పిల్లలకు తల్లిగా తండ్రి గా ఉంటుందని సీఎస్ఐ సంస్థ ఈ రోజు వరకు నిలపడింది అంటే ఎంతో మంది పెద్దల ప్రార్థన ఫలమని కె.రూబేన్ మార్క్ అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక చర్చి సంఘ పెద్దలు,మండలం మరియు పట్టణానికి చెందిన వివిధ గ్రామాల నుండి వచ్చిన సంఘల పాస్టర్లు,స్త్రీల మైత్రి,యూత్,చిన్నపిల్లలు పాల్గొని సంతోషాలతో పాటలు పాడుతూ కోలాటాలతో నృత్యం చేస్తూ ఆనందాలతో తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.