ఘనంగా సిపిఐ శత జయంతి ఉత్సవాలు.
భూపాలపల్లి నేటిధాత్రి
సిపిఐ పైలాన్ ఓపెనింగ్ కార్యక్రమానికి వేలాదిగా తరలి రావాలి.
సిపిఐ జిల్లా కార్యదర్శి కోరిమి రాజ్ కుమార్
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శతజయంతి వేడుకలు జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు.స్థానిక రావి నారాయణరెడ్డి భవన్ లో జిల్లా నాయకులతో కలిసి సిపిఐ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది.అనంతరం వారు మాట్లాడుతూ భారత దేశ స్వాతంత్ర ఉద్యమం కోసం ఆనాడు 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో మొట్టమొదటిసారిగా కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందన్నారు. నాటినుండి నేటి వరకు 100 సంవత్సర చరిత్రలో అనేక ఉద్యమాలు చేసి ప్రజల మన్నన పొందుతున్న ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని కొనియాడారు. సంపూర్ణ స్వాతంత్రం కావాలని వందలాది కమ్యూనిస్టులను ప్రాణ త్యాగం చేసిన చరిత్ర ఉందని తెలిపారు. తెలంగాణ రైతంగ సాయుధ పోరాటంలో నాలుగువేల మంది కమ్యూనిస్టుల అమరుల త్యాగాలతో నిజాం దోరాలను తరిమిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉందని అన్నారు. శత జయంతి ఉత్సవాలన పురస్కరించుకొని భూపాలపల్లి పట్టణ కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద పైలాన్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని ఈనెల 28వ తేదీన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ పైలాన్ ఓపెనింగ్ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరవుతున్నారని కావున జిల్లా కేంద్రంలో ఉన్న పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు, కళాకారులు మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని రాజ్ కుమార్ కోరారు.
భూపాలపల్లి పట్టణ కేంద్రంలో భగత్ సింగ్ కాలనీలో సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్, కారల్ మార్క్స్ కాలనీ 25వ వార్డు శాఖలో ఖ్యాతరాజ్ సతీష్, సుభాష్ కాలనీ 29వ వార్డులో కొర్మి సుగుణ, 24వ వార్డులో వేముల శ్రీకాంత్, ఆర్టీసీ బస్టాండ్ వద్ద నేరెళ్ల జోసెఫ్,కృష్ణ కాలనీలో పీక రవికాంత్ లు సిపిఐ పతాక ఆవిష్కరణలు చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గురుజపల్లి సుధాకర్ రెడ్డి, గనగల జోగేష్, గడ్డం సింహాద్రి, గోలి లావణ్య, మట్టి కృష్ణ, గంప రాజు, ఎండి అస్లాం, కుమ్మరి రమేష్ చారి,పల్లెల రజిత, పెద్దమాముల సంధ్య, పోతుగంటి స్వప్న, వాసం రజిత, మట్టి నాగమణి, సుభద్ర తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
