అంతరాలు లేని సమాజం కోసం కమ్యూనిస్టుల పోరాటం
సిపిఐ జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
సమ సమాజ నిర్మాణమే ధ్యేయమని సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమురయ్య భవన్లో రావి నారాయణరెడ్డి భవన్ లో సిపిఐ 100 సంవత్సరాల సందర్భాన్ని పురస్కరించుకొని అరుణ పతాకాన్ని ఎగురవేసి సిపిఐ 100 సంవత్సరాల ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్ హాజరై మాట్లాడుతూ అంతరాలు లేని సమసమాజ నిర్మాణమే ధ్యేయంగా కమ్యూనిస్టులు సిపిఐ పనిచేస్తుందని అన్నారు. ఈ 100 సంవత్సరాల సిపిఐ చరిత్రలో ఎన్నో పోరాటాలు నిర్వహించారని భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్వహించి వేలాది ఎకరాల భూములను పేదలకు పంచిన ఘనత సిపిఐకే దక్కిందన్నారు. అంతేకాకుండా స్వాతంత్రమే ధ్యేయంగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొని దేశ స్వాతంత్ర కోసం పనిచేసిన ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కమ్యూనిస్టులదే కీలక పాత్ర అని, నిలువ నీడలేని ఎంతో మంది పేదలకు భూములు ఇండ్ల స్థలాలు ఇప్పించారని అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కారల్ మార్క్స్ కాలనీ గుడిసెలు వేసుకొని నివసిస్తున్న గుడిసవాసులందరికీ ప్రభుత్వం ద్వారా పట్టాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. గుడిసెల ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో మూడు సంవత్సరాల ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఎవరైతే అర్హులైన వారి గుడిసెలు వేసుకొని వారికే ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్, సిపిఐ వార్డు కౌన్సిలర్ నూకల భూలక్ష్మి, సిపిఐ జిల్లా సమితి నాయకులు కొరిమి సుగుణ, నూకల చంద్ర మొగిలి, నేరెళ్ల జోసెఫ్ వేముల శ్రీకాంత్, ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్,లోకిని రమేష్,గోనెల తిరుపతి,పీక రవి,యాకూబ్ పాషా,గోలి లావణ్య,స్వరూప,సంధ్య,స్వప్న, రజిత 500మంది కార్యకర్తలు పాల్గొన్నారు.