దేవీ నామస్మరణతో పులకించిన ప్రాంగణం
#నెక్కొండ, నేటిధాత్రి : మండలంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కొలువుదీరిన అమ్మవారికి శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నాలుగవ రోజు ప్రత్యేక పూజలు సాగాయి. అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వరంగల్ భద్రకాళి దేవస్థాన వేద పండితులు పరిత్రన్ శర్మ, చతుర్వేదుల అచ్యుత శర్మ ఆధ్వర్యంలో అర్చకులు బివియన్ శాస్త్రి, శ్రవణ్ శాస్త్రి పర్యవేక్షణలో ప్రతిష్టాత్మకమైన చండీహోమ క్రతువు నిర్వహించారు. అమ్మవారి ఉపాసకులు దేవి సప్తశతి పారాయణం అనంతరం పంచసూక్తములతో భవనం రుద్ర సహిత చండీ హోమం చేశారు. వేద పండితులు విశ్వనాథ శర్మ , గోపాలకృష్ణమూర్తి శర్మ భాను ప్రకాష్ శర్మ సురేష్ శర్మ, వరప్రసాద్ సహజ యోధన్ శాస్త్రి , ప్రత్యేక సాయిరాం,సాయి రుగ్వేష్, డింగరి పవన్ కుమార్, విగ్రహ దాదా దోర్నాల ధర్మారెడ్డి వెంకటరమణ దంపతులు, శ్రీరామలింగేశ్వర సేవా సమితి బాధ్యతలు అనంతుల మురళీధర్ ,గన్ను సత్యం, గడ్డం సూరయ్య, నంగునూరు శివయ్య, గుమ్మడవల్లి లచ్చన్న, ఐల విజయ్ కుమార్, బండి విజయ్ భాస్కర్ రెడ్డి, దొడ్డ విజయ్ కుమార్, దొడ్డ వెంకటేశ్వర్లు దంపతులు పాల్గొన్నారు. గణపతి పూజ పుణ్యాహవాచనం , పంచగవ్య ప్రాశనము, రిత్వికరణము నవగ్రహ దిక్పాలక పంచలోక పాలక పూజ, సర్వతోభద్ర మండల దేవతారాధన తదితర కార్యక్రమాలు జరిగాయి. అనంతరం చండీ అమ్మవారికి పూర్ణాహుతి చేసి తీర్థ ప్రసాద వితరణ జరిపారు ,అన్నదానం కూడా చేశారు. వేద పండితుల ఆధ్వర్యంలో ఆశీర్వచన కార్యక్రమం ఘనంగా కొనసాగించారు.