
రామకృష్ణాపూర్,జనవరి 26, నేటిధాత్రి:
75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు క్యాతనపల్లి పుర పరిధిలో ఘనంగా జరిగాయి. పురపాలక సంఘ కార్యాలయంలో కమీషనర్ వెంకట నారాయణ, రామకృష్ణా పూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై రాజశేఖర్, క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సీనియర్ పాత్రికేయులు గట్టయ్య లు జాతీయ జెండాను ఎగురవేసి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలమే భారత స్వతంత్ర్యమని, వారు చూపిన మార్గంలో మనమందరం నడవాలని కోరారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు జనవరి 26 న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమాలలో పుర చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యా సాగర్ రెడ్డి, కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, పోలీస్ సిబ్బంది,పాత్రికేయులు పాల్గొన్నారు