
BC Welfare Association
మంత్రి కొండా సురేఖ జన్మదినం..ప్రతి ఇంట్లో పండగ రోజు
-బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మంత్రి కొండా సురేఖ జన్మదినం..ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలోని ప్రతి ఇంట్లో పండగ రోజని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ అన్నారు. మంగళవారం వరంగల్ ఖిల్లా కోటలోని వాకింగ్ గ్రౌండ్ లో జరిగిన మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలను వరంగల్ సిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నారగోని స్వప్న-మురళీ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ కు నారగోని స్వప్న-మురళీ గౌడ్ దంపతులు కేక్ తినిపించి మంత్రి కొండా సురేఖ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వేముల మహేందర్ గౌడ్ మాట్లాడారు. ఉమ్మడి ఓరుగల్లు జిల్లా ప్రజల ఆశాజ్యోతిగా..ఏ ఆపదొచ్చిన ఆ ఇంటి గడపను తట్టే లక్షలాది మంది ప్రజల ఇంటి ఆడపడుచుగా..బడుగు బలహీన వర్గాల ప్రజలకు వెన్నుదన్నుగా ఉంటూ..వారి అభివృద్ధినే కోరుకుంటూ నిరంతరం శ్రమిస్తున్న శ్రామికురాలు కొండా సురేఖ అని కొనియాడారు. పేద ప్రజల గుండెల్లో కొలువైన వీర వనితగా..ధర్మంలో రుద్రమదేవిగా..ధీరత్వంలో ఝాన్సీ రాణిగా..ఓదార్పులో భూదేవిగా..గుణంలో సీతాదేవిగా..పేద ప్రజలను ఇబ్బంది పెట్టే వారి పట్ల కాళికాదేవిగా..అనునిత్యం ప్రజలను కాపాడుకునే భద్రకాళిగా పేరు ప్రఖ్యాతులు గడించిన మంత్రి కొండా సురేఖ ఆ తిరుమల-తిరుమలేశుని ఆశీస్సులతో..ఆ వేములవాడ రాజరాజేశ్వరుని దీవెనలతో..భర్త కొండా మురళీధర్ రావు చల్లని నీడలో..ప్రజల అండదండలతో నిండు నూరేళ్లు కలకాలం వర్ధిల్లాలని, ఇంకా మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, తమరు మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆ కట్ట మైసమ్మను, రేణుక ఎల్లమ్మ తల్లిని వేడుకుంటున్నట్లు మహేందర్ గౌడ్ తెలిపారు. అనంతరం ఆయన మొక్కలను నాటారు.