
Chakali Ailamma 40th Birth Anniversary Celebrated in Ramakrishnapur
ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
చాకలి ఐలమ్మ 40 వ వర్ధంతి వేడుకలు రామకృష్ణాపూర్ పట్టణంలో బీజోన్ రజక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. బి జొన్ రజక సంఘం అధ్యక్షులు నడిగోట తిరుపతి, గౌరవ అధ్యక్షులు మణికంఠ రాజయ్య, ముఖ్య అతిధులు, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి లు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటం, రజాకార్ల ఉద్యమం, భూస్వామ్య, పెత్తందారుల విధానాలకు విరోచితంగా పోరాటాలు చేసిన ఘనత చాకలి ఐలమ్మదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి కంచర్ల శ్రీనివాస్, కార్యదర్శి నాగరాజు, ప్రధాన కార్యదర్శి కనకయ్య, సమ్మయ్య, జిల్లా అధ్యక్షులు తంగళ్ళపల్లి వెంకటేష్, కార్యదర్శి రాములు, సహాయ కార్యదర్శి కళావతి ,వర్కింగ్ ప్రెసిడెంట్ హనుమంతు, మున్సిపల్ మాజీ వర్డ్ కౌన్సిలర్ పోగుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు