మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కెటిఆర్ జన్మదినం సందర్భంగా వరంగల్ లో ఘనంగా వేడుకలు

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కెటిఆర్ జన్మదినం పురస్కరించుకొని వరంగల్ నగరంలో పలుచోట్ల కేక్ లు కట్ చేసి పండ్ల పంపిణీ అన్నదానం నిర్వహించారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా నాయకులు దాచేపల్లి సీతారామ్ ఆధ్వర్యంలో ఎంజిఎం ఆసుపత్రి ఆవరణంలో ఏర్పాటు చేసిన అన్నదానం కేక్ కటింగ్ పండ్ల పంపి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర వరంగల్ తొలి మేయర్, తూర్పు మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ హాజరై కేక్ కట్ చేసి పండ్ల పంపిణి చేసి అన్నదానం చేశారు. గతంలో కెటిఆర్ చేతుల మీదుగా ఎంజిఎం ఆసుపత్రి ఆవరణంలో అన్నపూర్ణ పథకాన్ని ఏర్పాటు చేసుకున్నామని మళ్లీ ఆయన జన్మదినం సందర్భంగా ఇదే చోట భోజనం వడ్డీయడం చాలా సంతోషం ఉందని మాజీ ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వరంగల్ జిల్లా నాయకులు దాచేపల్లి సీతారామ్ ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమం లో మాజీ వరంగల్ జిల్లా ప్రాంతీయ రవాణాశాఖ సభ్యులు గోరంటల మనోహర్, మాజీ మార్కెట్ చైర్మన్ తుమికి రమేష్ బాబు, 24 డివిజన్ ముఖ్య నాయకులు సోను, రషీద్, విశ్వనాథ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *