సిరిసిల్ల(నేటి ధాత్రి):
కాశీ క్షేత్ర పాలకుడైన శ్రీ కాళ భైరవ స్వామి వారిని సిరిసిల్ల క్షేత్రపాలకునిగా కష్ట నష్ట నివారణ కొరకు శ్రీ గాంధీనగర్ రుక్మిణి విఠలేశ్వర భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో శ్రీ కాళ భైరవ స్వామి వారిని ప్రతిష్టించుకొని నిత్యం పూజలు అందించడం జరుగుతుంది.
ఈరోజు మార్గశిర మాస బహుళ ఆష్టమి శ్రీ కాళ భైరవ స్వామి వారి జయంతి సందర్భంగా శ్రీ భక్తాంజనేయ రుక్మిణివిఠలేశ్వర కాలభైరవ స్వామి దేవస్థానం గాంధీనగర్ సిరిసిల్లాలొ పలు కార్యక్రమములు నిర్వహించడం జరిగింది.
ఉదయం గం.6:30 ని.ల నుండి 9-00 వరకు స్వామివారికి జలాభిషేకము
అనంతరం 9 గంటల నుండి 10 గంటల వరకు స్వామివారికి యజ్ఞ కార్యక్రమం
అనంతరం 10:00 నుండి గంటలకు శ్రీ కాళ భైరవ స్వామి వారి ఉత్సవమూర్తిని పల్లకీ లో పుర వీధుల గుండా ఊరేగింపు
చేసి 11:30 నుండి స్వామివారికి అష్టోత్తర శతనామావళి పూజ మరియు హారతి చేయడం జరిగింది.
తదనంతరం భక్తులకు అన్న ప్రసాధ వితరణ చేయడమైనది.
ఇట్టి కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ గుండ్లపెల్లి నీరజ పూర్ణచందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడేపు రవీందర్, మాజీ కౌన్సిలర్ గుండ్లపెల్లి పూర్ణచందర్, కౌన్సిలర్ దార్నం అరుణ లక్ష్మినారాయణ, ఆలయ అద్యక్షులు వడ్లకొండ ఆనందం, కార్యదర్శి కుడిక్యాల శంకర్, ఉపాధ్యక్షులు కోడం అమర్నాథ్, సహాయ కార్యదర్శి పత్తిపాక వేణుగోపాల్, కోశాధికారి కొమాకుల ఆంజనేయులు, శ్రీపతి పరుశురాం, పంతం రవి, కోడం నారాయణ, తడుక విశ్వనాథం, ఆంకారపు జ్ఞానోభ, అంకారపు కృష్ణహరి, గెంట్యాల గోపి, వావిలాల ఆనందం, ముదిగంటి వేణు, మ్యాన రాంప్రసాద్, రాపెల్లి సంతోష్, అన్నల్దాస్ రాకేష్ భక్తులు పాల్గొన్నారు.
ఘనంగా శ్రీ కాళ భైరవ స్వామి జయంతి వేడుకలు
