ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న పార్టీ నాయకులు

జెడ్పి వైస్ చైర్పర్సన్ కళ్ళెపు శోభ రఘుపతిరావు, మున్సిపల్ చైర్ పర్సన్ సేగ్గం వెంకటరాణి సిద్దు

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతిల ఆదేశాల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 70వ జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ పార్టీ అర్బన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ వైస్ చైర్ పర్సన్ కళ్లెపు శోభ రఘుపతిరావు, భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గo వెంకటరాని సిద్ధులు ముఖ్యఅతిథిగా హాజరై భారీ కేక్ కట్ చేసి జనహృదయనేతకు కెసిఆర్ కి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ చావు కడుపులో తలకాయ పెట్టి 14 ఏళ్లు పోరాడి ఆంధ్రుల చెరకోయలలో చిక్కుకున్న తెలంగాణను సాధించిన, మహనీయుడన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణగా అభివృద్ధి చేసి, దేశంలోనే తెలంగాణను ధనిక రాష్ట్రంగా తీర్చిదిద్దాడన్నారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలపడంతో పాటు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను యావత్ భారతదేశానికి తెలియజేసిన గొప్ప నాయకుడు అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందారని, బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం తపించే మాజీ సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, 8వ వార్డు కౌన్సిలర్ నూనె రాజు పటేల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పిన్ రెడ్డి రాజిరెడ్డి, అర్బన్ ప్రధాన కార్యదర్శి బిబి చారి, జాగృతి జిల్లా అధ్యక్షుడు మాడా హరీష్ రెడ్డి, భక్తాంజనేయ స్వామి టెంపుల్ చైర్మన్ గడ్డం కుమార్ రెడ్డి, మున్సిపల్ కోఆప్షన్ నెంబర్ బేతోజ్ వజ్రమని బీబీచారి, గుడాడుపల్లి మాజీ సర్పంచ్ ఉడుత ఐలయ్య, బీఆర్ఎస్ నాయకులు బండారి రవి, లక్ష్మారెడ్డి, రామయ్య, పోలవేణి అశోక్, మచ్చ భద్రయ్య, రవీందర్, కిషన్ రావు, మచ్చ వెంకన్న, శ్రీనివాస్, ప్రవీణ్, భూక్య శ్రీరామ్, సుధాకర్, అమృత అశోక్, తిరుపతి, మహిళా నాయకురాలు పుష్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *