
విభిన్న వేషధారణలో పిల్లలు.
శాయంపేట నేటి ధాత్రి:
ప్రతి సంవత్సరం భారతదేశ మాజీ ప్రధాని నెహ్రూ జన్మదినం సందర్భంగా నవంబర్ 14వ తేదీన బాల దినోత్సవం జరుపుకుంటున్న సంగతి తెలిసిందే ఈ ఏడాది కూడా నవంబర్ 14న తేదీన బాల దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నారు. జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకొని ప్రగతి సింగారంలోని సన్ రైస్ పాఠశాలలో పిల్లలు వివిధ వేషధారణలో వచ్చారు మరియు పిల్లలు సింగారంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజుగా పవన్ భరతమాతగా లాస్య ఆర్మీ పోలీసు లాయరు డాక్టరు ఆదిమానవులుగా రెడీ అయినారు పిల్లలను ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపాల్ తిరుపతి వివిధ జాతీయ నాయకుల జీవితాలను స్పూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు సాయి రెడ్డి శ్రీధర్ కిరణ్ జ్యోతి గీత అనుష తదితరులు పాల్గొన్నారు.