మంచిర్యాల జిల్లా కేంద్రంలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయాలి
మంచిర్యాల,నేటి ధాత్రి:
బీసీ సమాజ్ మంచిర్యాల కార్పొరేషన్ కమిటీ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలవేసి జయంతి ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ బహుజన రాజు చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రంలో నెలకొల్పుటకు అనుమతించాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏ విధంగా నైతే హిందూ రాజస్థాపన కై పోరాటం చేసిండో అదేవిధంగా వారి స్ఫూర్తితోనే బీసీ రాజ్యాధికార స్థాపనకు బీసీ సమాజ్ యావత్ బిసి సమాజాన్ని ఏకం చేసి బిసి రాజ్యాధికారం దిశగా పోరాటాలను కొనసాగిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ సీనియర్ నాయకులు బొలిశెట్టి లక్ష్మణ్, బియ్యాల సత్తయ్య,పోరండ్ల శ్రీనివాస్,సల్ల విజయ్ కుమార్, జక్కం రవీందర్,గుమ్మల సుదర్శన్,బిరుదు రాజు ,శ్రీధర్, రాజు,వెన్నంపల్లి మురళి, గుండ్ల లక్ష్మణ్,బీసీ సమాజ్ మహిళా నాయకురాలు ఆకుతోట పద్మాదేవి,వీణవంక నాగలక్ష్మి,చెన్నూరు ఉమాదేవి తదితరులు పాల్గొని శివాజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు.