నల్లబెల్లి, నేటి ధాత్రి:
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరవనిత చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలను నల్లబెల్లి గ్రామం రజక సంఘం అధ్యక్షుడు రాపాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ సునీత, బిజెపి జిల్లా కార్యదర్శి తడక అశోక్ గౌడ్ హాజరై ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ తెలంగాణ పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి తెలియజేసిన గొప్ప పోరాట యోధురాలు అని వారు కొనియాడారు కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రతాపరెడ్డి, ఎం సిపిఐయు కార్యదర్శి దామ సాంబయ్య, అన్న కారిన వర్గాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు పరికి కోర్నల్, పాండవుల రాంబాబు, కొండ్లె రమేష్, వైనాల జక్కయ్య, సారమల్లు, వీరస్వామి, సంతోష్, రమేష్, శరత్, కేజీబీవీ ఉపాధ్యాయురాల్లు అరుణ,జ్యోతి, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.