పురవీధుల నుండి బాణాసంచ పేలుళ్లతో ఊరేగింపు
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం పద్మశాలి ఇలవేల్పు బ్రహ్మర్షి భక్త మార్కండేయ జయంతిని పురస్కరించుకొని సోమవారం మండల కేంద్రంలోని శివ మార్కండేయ ఆలయంలో భక్త మార్కండేయనికి పంచామృత అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. మార్కండేయ స్వామి వైభవ వ్రతాన్ని మార్కండేయ హోమాన్ని వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ అర్చకులు మార్త రాజకుమార్, తాటి రమేష్ ఆచార్యలు కన్నుల పండుగగా నిర్వహించారు అనంతరం స్వామివారి విగ్రహాన్ని చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై గ్రామంలోని పురవీధుల గుండా డిజె సౌండ్స్ నడుమ ఊరేగించగా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ వేడుకలలో ఆలయ కమిటీ చైర్మన్ బాసాని సూర్యప్రకాష్, స్థానిక సర్పంచ్ కందగట్ల రవి చేనేత సొసైటీ చైర్మన్ మామిడి శంకర్ లింగం పాలకవర్గ సభ్యులు బూర లక్ష్మీనారాయణ దిడ్డి ప్రభాకర్ పద్మశాలి యువసేన మండల అధ్యక్షులు వడ్డేపల్లి శ్రీనివాస్ భక్తులు పాల్గొన్నారు.