చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో సోమవారం రోజున పద్మశాలి కుల దైవం శ్రీ భక్త మార్కండేయ జయంతి వేడుకలను పద్మశాలి వీవర్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి చింతకింది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు కట్కూరి నరేందర్ హాజరై మార్కండేయ చిత్రపటానికి పూలమాలలు వేశారు.
అనంతరం స్థానికులకు పండ్లు, మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి సామల రాజేందర్, సభ్యులు కొక్కుల రాములు, మాచర్ల సంజీవ్, చింతకింది సంపత్, చింతకింది దశరథం, ఖ్యాతం మార్కండేయ, నాగుల రమేష్, వెల్దండి సత్యనారాయణ, చింతల మహేందర్, లకుమ్ చంద్రమౌళి, ఈగ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు