
తెలంగాణ జాతిపిత కేసిఆర్..
బీఆర్ఎస్ నాయకులు రాజా రమేష్, పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్
రామకృష్ణాపూర్ ,ఫిబ్రవరి 17, నేటిధాత్రి:
భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు 70 వ జన్మదిన వేడుకలు శనివారం రామకృష్ణాపూర్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షులు కంబగౌని సుదర్శన్ గౌడ్, నాయకులు డాక్టర్ రాజా రమేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కేసీఆర్ పట్టువదలని విక్రమార్కుడుగా పోరాడారని, తెలంగాణ సాధించడంతో తెలంగాణ జాతిపితగా అభివర్ణించుకుంటున్నామని అన్నారు. కెసిఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని రాష్ట్ర ప్రజలు, బిఆర్ఎస్ నేతలు అందరూ కోరుకుంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రేవెల్లి ఓదెలు, జీలకర మహేష్,గడ్డం సంపత్, అలుగుల శ్రీలత- సత్యం,పోగుల మల్లయ్య,జాడీ శ్రీనివాస్, యూత్ నాయకులు బిఆర్ఎస్ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.