ఘనంగా గిరిజన ఉన్నతాధికారి జన్మదిన కార్యక్రమాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి దాత్రి

సింగరేణి సీ.ఎన్.ఎండి బలరాం నాయక్ ఐ ఆర్ ఎస్ మరియు ఇన్కమ్ టాక్స్ కమిషనర్ జీవన్ లాల్ ఐ ఆర్ ఎస్ జన్మదినం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ధన్బాద్ లక్ష్మీదేవి పల్లి ప్రశాంతి నగర్ కాలనీ పినపాక టేకులపల్లి అశ్వరావుపేట బూర్గంపాడు ఖాళీ ప్రదేశాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి గిరిజన ఉన్నత అధికారులకు సెల్ ఫోన్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏజెన్సీ పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు లాల్ సింగ్ నాయక్ పాల్గొని మారుమూల గిరిజన తండాలలో పుట్టి ఎంతో కష్టపడి ఈరోజు రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వహించడం ఎందరికో గర్వకారణం అని ప్రకృతి ప్రేమికుడు బలరాం నాయక్ గారు లక్షల మొక్కలు నాటి జాతీయ స్థాయిలో అవార్డులు పొంది త్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డు పొందడం ఎందరికో ఆదర్శమని సింగరేణి సంస్థ దేశంలోనే అగ్రస్థానంలో ఎన్నో విజయాలు అందుకోవడంలో కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో నిరంతరం సమిస్తూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనతో సరికొత్త నిర్ణయాలతో ముందుకు సాగడంలో బలరాం కృషి ఎంతో ఉందని అదేవిధంగా రాష్ట్ర ఇన్కమ్ టాక్స్ కమిషనర్ గా ఉంటూనే జీవన్ లాల్ తనకు ఉన్నటువంటి కొద్దిపాటి సమయాన్ని గిరిజనుల అభ్యున్నతి కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని కొనియాడారు ఇటువంటి ఆదర్శవంతుల జన్మదిన సందర్భంగా సుమారు 1000 మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం ఎందరికో ఆదర్శమని తెలిపారు
ఈ కార్యక్రమంలో ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్ పెనుబల్లి ఎంపీటీసీ భూక్య రుక్మిణి గరీబ్ పేట ఎంపీటీసీ భద్రం పిచ్చేటి శ్రీకాంత్( బాచి ) బోధసు కనకరాజు ధన్బాద్ మాజీ సర్పంచ్ రాందాస్ నాయక్ టూ ఇంక్లైన్ మాజీ సర్పంచ్ నగేష్ ప్రశాంతి నగర్ మాజీ సర్పంచ్ హలవత్ రుక్మిణి రంజిత్ నాయక్ ఏజెన్సీ పర్యవేక్షణ కమిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మాలోత్ అశోక్ బాబు నాయక్ జిల్లా బాధ్యులు అరుణ్ మురళి శ్రీనివాసు కిరణ్ వీరేందర్ ప్రతాప్ శివ కిరణ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *