వేములవాడ, నేటి దాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మహంకాళి గుడి దగ్గర ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషదాయకమని పార్టీ కోసం ఎనలేని సేవలు చేసినటువంటి గొప్ప వ్యక్తి జీవన్ రెడ్డి అని ఆయన అన్నారు ఆయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో బాగుండాలని ఆయన ఆ స్వామి వారిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి కౌన్సిలర్ బింగి మహేష్, నాయకులు కూరగాయల కొమురయ్య, చిలుక రమేష్, పులి రాంబాబు గౌడ్, పీర్ మహమ్మద్, వంగల శ్రీనివాస్, కనికరపు రాకేష్, ముప్పిడి శ్రీధర్, వస్తాది కృష్ణ, అబ్దుల్ రజాక్, దాడి మల్లేశం, కోయీనేని శ్రీనివాస్, కోలకాని రాజు, వలి మొహమ్మద్, ముంజ ఉమేందర్, చిలివేరి శ్రీనివాస్ గౌడ్, దండుగుల తిరుపతి, ఆగయ్య, తదితరులు ఉన్నారు.