తొర్రూరులో ఘనంగా జరిగిన ఝాన్సి రాజేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు – హాజరైన ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి గారు, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు..
తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి
టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని తొర్రూరు పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా ప్రారంభించారు.
పార్టీ కార్యాలయం శుభాకాంక్షల బ్యానర్లు, పూలదండలతో కళకళలాడింది. పట్టణ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై, పూలమాలలు వేసి, ఝాన్సి రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకలకు మరింత ఉత్సాహాన్ని తెచ్చారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ.. ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు ప్రజల కోసం ఎల్లప్పుడూ అహర్నిశలు కృషి చేస్తున్నారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె చూపుతున్న పట్టుదల అందరికీ ఆదర్శం. ఇలాంటి నాయకురాలు కాంగ్రెస్ పార్టీకి ఉండటం గర్వకారణం అని పేర్కొన్నారు..
అలాగే టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. ప్రజలు, కార్యకర్తలు చూపిస్తున్న ప్రేమాభిమానాలు నన్ను మరింత కర్తవ్యబద్ధురాలిని చేస్తున్నాయి. ఈ ఆశీస్సులు, శ్రద్ధే నాకు బలమై, ప్రజాసేవలో మరింత కృషి చేయడానికి ప్రేరణనిస్తాయి” అని తెలిపారు..
కార్యక్రమం అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకొని, అన్నదానం కార్యక్రమం కూడా నిర్వహించారు.
ఈ వేడుకల్లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సోమ రాజశేఖర్ బ్లాక్ అధ్యక్షులు ఆమ్య నాయక్ , మండల నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని జన్మదినోత్సవాన్ని విజయవంతం చేశారు..