చిట్యాల, నేటిధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శనివారం రోజున మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ 70 వ జన్మదిన వేడుకలను బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఆరెపల్లి మల్లయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా జెడ్పిటిసి గొర్రె సాగర్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేసి సాధించిన తెలంగాణ ను బంగారు తెలంగాణ గా మార్చిన ఘనుడు కెసిఆర్ అని వారు నిండు నూరేళ్లు కలకాలం సంతోషంగా ఉండాలి అని మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని,రాష్టంని సుభిక్షము వుండే విధంగా చూడాలి అని కోరుకున్నట్లు పేర్కొన్నారు,ఈ కార్యక్రమం లో పి ఏ సి ఎస్ చైర్మన్, కుంభం క్రాంతికుమార్ రెడ్డి, వైస్ చైర్మన్ ఏరుకొండ గణపతి,మాజీ మార్కెట్ చైర్మన్ కొత్తురి రాజిరెడ్డి మండల ప్రధాన కార్యదర్శి ఎరుకొండ రాజేందర్ గౌడ్, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు ఈర్ల మల్లక్క, నాయకురాలు శ్రీదేవి ఎంపిటిసిలు జంబూల తిరుపతి, కట్కూరి పద్మ నరేందర్, మాజీ సర్పంచ్ లు మహేందర్, శ్రీను, నాగరాజు, పార్టీ జిల్లా, టౌన్ అధ్యక్షులు బుర్ర శ్రీధర్ గౌడ్,యూత్ అధ్యక్షులు మాసు రమేష్ మండల నాయకులు జన్నే యుగేందర్,పిట్టా సురేష్,నోముల నాగరాజ్ దుప్పటి శ్రీను ఉపుల రవి రమణ చారి, పాండ్రాల వీరస్వామి, దొడ్డే శంకర్, దామెర రాజు,కిరణ్, నల్ల దేవేందర్ రెడ్డి,మెరుగు సారంగ పాణి, రవి, గుండా రవీందర్,మర్రి నరేష్ మోలుగురి రాకేష్,కట్కూరి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.