జన్మదిన వేడుకల్లో పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే
కాప్రా నేటి ధాత్రి జనవరి 22
కాప్రా డివిజన్ యువ నాయకుడు, బి ఎల్ ఆర్
చారిటబుల్ ట్రస్టు ప్రతినిధి బైరి నవీన్ గౌడ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం కాప్రా డివిజన్ సాయిరాం నగర్ బస్తీ దవాఖాన వద్ద ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి.
ఈ కార్యక్రమంలో కాప్రా డివిజన్ బైరి నవీన్ గౌడ్ యువసేన సభ్యులు, బి ఎల్ ఆర్ టీం ,కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.