వీణవంక (కరీంనగర్ జిల్లా):
నేటి ధాత్రి:ఆడబిడ్డల పండుగ బతుకమ్మ పండుగ పురస్కరించుకొని వీణవంక మండల కేంద్రంలోని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ హుజురాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి సతీమణి పాడి శాలిని రెడ్డి వారి సగృహంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు మహిళలతో పాటు బతుకమ్మను పేర్చి బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. పాడి శాలిని రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ పండుగను పురస్కరించుకుని హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలతో మమేకమైన బతుకమ్మ వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషకరమైన అన్నారు. తీరక పువు తో బతుకమ్మను పేర్చి గౌరమ్మను తయారుచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆడపడుచుల ప్రతి కథ బతుకమ్మ వేడుకలు ముందస్తు బతుకమ్మ బతుకమ్మ వేడుక శుభాకాంక్షలు తెలిపారు.
వారి సగృహంలో బతుకమ్మ వేడుకలను గ్రామ ప్రజలతో ఆటపాటలతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీణవంక ఎంపీపీ రేణుక తిరుపతి రెడ్డి, హుజురాబాద్ ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గంధ రాధిక శ్రీనివాస్, ఇల్లందకుంట ఎంపీపీ సరిగోమ్ముల పావని వెంకటేష్, వైస్ ఎంపీపీ లత శ్రీనివాస్, కొయ్యడ శ్రీదేవి కమలాకర్, మహిళలు తాళ్లపల్లి రాణి మహేందర్ గౌడ్ , పొన్నగంటి విజయలక్ష్మి మల్లయ్య,నీల లక్ష్మి, రాజేశ్వరి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.