
భూపాలపల్లి గౌడ సంఘంల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించారు
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా 314 వ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి ఆత్మబలి దాన దినోత్సవం జయశంకర్ భూపాలపల్లి గౌడ సంఘంల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి గౌడ సంఘంల జేఏసీ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్ మాట్లాడుతూ
బడుగు బలహీన వర్గాల చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న 30 సంవత్సరాలు బడుగు బలహీన వర్గాల కుల మతాలకు అతీతంగా సుపరి పరిపాలన చేసినాడు గోల్కొండ కేంద్రంలో 12 మందితో తయారైన సైన్యం కొన్ని లక్షల మంది సైన్యాన్ని తయారు చేసినాడు 8 సంవత్సరాలు పరిపాలించారు 21 కోటలను నిర్మించాడు పరిపాలన కొనసాగించినాడు ఆగస్టు 18 1650 జన్మించి నాడు 1910లో సంవత్సర మోగులు సైన్యం చుట్టూ ముట్టినప్పుడు వారి చేతిలో బలి పశు కావద్దని పాపన్న చేతిలోని బల్లెం తీసుకొని ఆత్మ బలిదానం చేసుకున్నాడు వీరుడు ముద్దుబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగిద్దాం
గీత కార్మికుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం అణగారిన వర్గాల కోసం కులాలకు మతాలకు అతీతంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగిద్దామని జేఏసీ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్ తెలిపారు
ఈ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి గౌడ సంఘం జేఏసీ కమిటీ నాయకులు బుర్ర కుమారస్వామి గౌడ్ తాటి అశోక్ గౌడు పులి వేణు గోపాల్ గౌడ్
పరకాల సమ్మయ్య గౌడ్ బొల్లెపల్లి జగన్ గౌడ్ మాటూరు రవీందర్ గౌడ్ నాగపురి సమ్మయ్య గౌడ్ బుర్ర రాజయ్య గౌడ్ బుర్ర సదానందం గౌడ్ కోల రాజమల్లు గౌడ పానుగంటి శ్రీనివాస్ గౌడ సుక్క బాలరాజు గౌడ్ ఆకుల రమేష్ గౌడ్ జిల్లా గౌడ సంఘం యూత్ నాయకులు బుర్ర రాజు గౌడ్ బుర్ర మనోజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు