గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్ ఉప సర్పంచ్ కి సన్మానం.
చిట్యాల, నేటిదాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని వెంకట్రావుపల్లి సి ఝాన్సీగ్రామైక్య సంఘం మహిళలు ఐకెపి సీసీ రమణ దేవి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచి ఉపసర్పంచి వార్డు మెంబర్లను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు, సర్పంచ్ తౌటం లక్ష్మి మాట్లాడుతూ మహిళలు తమ పొదుపు ద్వారా సంఘాలను బలోపేతంచేసుకొని ఆర్థిక అభివృద్ధిని సాధించాలని అన్నారు,ఉపసర్పంచి బుర్ర వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ మహిళా సాధికారత సాధించాలని మహిళలు అన్ని రంగాల్లో రాణించి ప్రభుత్వం నుంచి వచ్చే రుణాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని అన్నారు, ఐకెపిసిసి రమణ దేవి, ఐదో వార్డ్ మెంబర్ సలీమా బేగం గ్రామైక్య సంఘ సభ్యులు మహిళా సంఘాల ప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
