జాబితాలో పేర్లు రానివారికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు
ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు
పరకాల నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 26 జనవరి ప్రారంభం చేసే రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,ఆహార భద్రత కార్డుల జారీ మరియు ఇందిరమ్మ ఇండ్ల గురించి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ననుసరించి ఈ నెల 16 నుండి గ్రామాలలో అధికారులు విచారణ జరిపి తయారు చేసిన జాబితాలను 21 నుండి గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజలకు వివరించడం జరుగుతుందని మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు తెలిపారు.21నఅలియాబాద్ , మల్లక్ పేట్,హైబోత్ పల్లి మధ్యాహ్నం 2 గంటలకు లక్ష్మీపూర్,22న ఉదయం పోచారం,వెంకటాపూర్ మధ్యాహ్నం 2గంటలకు కామారెడ్డి పల్లి,పైడిపల్లి
23న నాగారం,వెల్లంపల్లి లలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.అర్హతకల వారి పేర్లు జాబితాలో రానట్లైతే వారు దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.