* గ్రామంలో నీటి సమస్య తలెత్తకూడదు
•ప్రత్యేక అధికారి
సుధాకర్ దేశ్ముఖ్
నిజాంపేట: నేటి ధాత్రి,ఏప్రిల్ 4
నిజాంపేట మండల పరిధిలోని నందగోకుల్ గ్రామంలో గురువారం నాడు గ్రామ ప్రత్యేక అధికారి సుధాకర్ దేశ్ముఖ్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించడం జరిగింది.. ఈ గ్రామసభలో గ్రామంలో గల పలు అంశాల గురించి చర్చించడం జరిగింది. గ్రామస్తులు ముందుగా గ్రామంలో నీటి ఎద్దడి అధికంగా ఉందని వాటిని నివారించాలని కోరారు. దానికి ప్రత్యేక అధికారి సానుకూలంగా స్పందించి గ్రామంలో గల ఒకటో వార్డులో నీటి ఎద్దడి అధికంగా ఉండడంతో బోరు మోటర్ తీసుకువచ్చి బోరుబావిలో దించామని తెలిపారు. మరికొన్ని రోజుల్లో అన్ని వార్డులలో నీటి సమస్యలు తీర్చడం జరుగుతుందన్నారు. అనంతరం గ్రామంలో జరిగే ఉపాధి హామీ పనుల ను పరిశీలించారు. ఉపాధి హామీ పనుల్లో ఉన్నటువంటి సమస్యలను గ్రామస్తులు ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి చంద్రహాసస్, గ్రామస్తులు పాల్గొన్నారు.