ఆరు నెలలుగా వేతనం లేక విలవిల ఆడుతున్న గ్రామపంచాయతీ కార్మికులు.
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండల కేంద్రంలో పనిచేస్తున్నటువంటి గ్రామపంచాయతీ కార్మికులను సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడం జరిగింది గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది…. గ్రామపంచాయతీ కార్మికులు 6 నెలలుగా మాకు వేతనాలు ఇవ్వడం లేదు కానీ మాతో పనిచేయించుకుంటున్నారు ఆదివారం కూడా మాకుసెలవు ఇవ్వడం లేదని వర్షాకాలం మొదలైంది అనేక మురికి కాలువలు సాపు చేయవలసిన అవసరం ఉన్నది చేతులకు బ్లౌజులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నది మీ ఇష్టమైతే చేయండి లేకపోతే పోండి అని చెప్పేసి.. పంచాయతీ కార్యదర్శి అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం గ్రామపంచాయతీలకు మూడు సంవత్సరాలుగా ఒక పైసా కూడా ఇవ్వకుండా 12000 వెయ్యిల కోట్ల రూపాయలను దారి మళ్ళించింది కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామ పంచాయిలు నడిచే పరిస్థితి కొనసాగింది ఒక పౌరుడికి నెలకు 16 రూపాయలు గ్రామపంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం కట్టించవలసిన అవసరం ఉన్నది కానీ అలా చేయకుండా గత ప్రభుత్వం గ్రామపంచాయతీలను విస్మరించింది ఇంటి పన్నులు ఇస్తేనే నల్ల పనులు ఇస్తేనే నీళ్లు వస్తాయని పంచాయతీ కార్యదర్శులు స్పెషల్ ఆఫీసర్లు బెదిరిస్తున్నారు లేకపోతే మీకు నీళ్లు రావని కరకండిగా చెప్పేస్తున్నారు కొన్ని గ్రామాల్లో గ్రామపంచాయతీ కార్మికులకు సంవత్సరంగా వేతనాలు కూడా రావడం లేదు గ్రామపంచాయతీ కార్మికులను వెట్టిచాకిరి చేయించుకుంటూ వారి శ్రమను దోచుకుంటున్నారు ఏ పశువు చచ్చిన గ్రామపంచాయతీ కార్మికులేశుభ్రం చేయాలి ఇచ్చిన అర కొర వేతనాలు కూడా సకాలంలో ఇయ్యకుండా ఇబ్బంది పెడుతున్నారు…. గ్రామపంచాయతీలో కొన్ని గ్రామాల్లో చెత్త కోసం తిరగాల్సిన ట్రాక్టర్లు తిరగడమే బంద్ చేసిన డీజిల్ లేక అల్లాడుతున్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి గ్రామపంచాయతీ కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం …