బైకు ప్రమాదంలో గ్రామపంచాయతీ కారోబార్ మృతి.
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని నవాబుపేట గ్రామానికి చెందిన జిల్లేల కుమార్(42) తన పనులు ముగించుకొని ఇంటికి వెళుతున్న క్రమంలో మంగళవారం రాత్రి చిట్యాల మండల కేంద్రంలోని ఎఫ్ సి ఐ గోదాం సమీపంలో బైక్ అదుపుతప్పి అక్కడికక్కడే మృతి చెందాడు బుధవారం ఉదయం స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు, అనంతరం పోలీసులు పోస్టుమార్టం కోసం చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలించారు, ప్రమాదం ఎలా జరిగింది అనే పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది, కుమారు మృదుస్వభావి అందరితో కలుపుకుపోయే మంచి వ్యక్తి అని అకారణంగా దూరమైనందుకు గ్రామ ప్రజలే కాకుండా మిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు, కుమారు ఉన్నత విద్యావంతుడు పీజీ వరకు చదివి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సర్వ శిక్ష అభియాన్ లో అకౌంటెంట్గా పనిచేసినాడు, తర్వాత కైలాపూర్ గ్రామ కారోబార్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తుండేవాడు.అతనికి భార్య ఇద్దరు కుమారులున్నారు.చిట్యాల నుండి నవాబుపేటకి తన ఇంటికి వెళ్తుండగా చిట్యాల చెరువు సమీపంలో తాడి చెట్టుకు డీ కొనడంతో రాత్రి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.