ఖానాపూర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రం.
నాగర్ కర్నూల్/నేటి దాత్రి:
బిజినపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో పి ఎ సి ఏస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సకాలంలో ధాన్యం కొంటున్నామని తెలిపారు.సన్నరకం వడ్లకు క్వింటాకు రూ500బోనస్ ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. రైతులు ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమం లో మండల నాయకులు ,కాంగ్రెస్ పార్టీ నాయకులు,రైతులు, కార్యకర్తలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.