ధాన్యం కొనుగోలు వివరాలు .

Grain

ధాన్యం కొనుగోలు వివరాలు ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీలు చేయాలి….

– జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్…

కొల్చారం, (మెదక్) నేటిధాత్రి:-

 

కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీలు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు.
శనివారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామంలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, సంబంధిత ఎంపీడీవో ఇతర అధికారులతో కలిసి
కలెక్టర్ పరిశీలించారు.

Grain
Grain

ధాన్యం సేకరణ, ట్యాబ్ ఎంట్రీలు . ఐకేపీ, కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటి దాకా సేకరించిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం సేకరించిన వెంటనే వాటి వివరాలను ట్యాబ్ ఎంట్రీ చేయాలని కలెక్టర్. సూచించారు. నాణ్యతా ప్రమాణాలు మేరకు ధాన్యం తీసుకువచ్చిన రైతుల నుంచి నిబంధనల ప్రకారం తూకం వేయాలని ఆదేశించారు. ధాన్యం డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడేలా చూడాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు వివరాలు ట్యాబ్ ఎంట్రీ చేయని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐకేపీ, డీసీఎంఎస్, ప్యాక్స్, ఆద్వర్యంలో ఇప్పటి దాకా 2715 మంది రైతుల నుంచి 53,602 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని వెల్లడించారు. మొత్తం రూ. 28కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో వేశామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, సుశీల్వా, కొల్చారం మండల సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!