శ్రీప్రగతిలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని శ్రీ ప్రగతి హై స్కూల్ లో యుకేజి విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి అంబాటి వేణుకుమార్ హాజరై విద్యార్థులకు పట్టాలను అందజేశారు. ఈకార్యక్రమంలో నూట ముప్పై ఎనిమిది మంది యుకేజి విద్యార్థులు గ్రాడ్యుయేషన్ డ్రెస్లలో తమ తల్లిదండ్రుల సమక్షంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈసందర్భంగా పాఠశాల చైర్మన్ అన్నదానం రాధాకృష్ణ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులకు అందిస్తున్న సహకారం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థులు పాఠశాలలో వారి అనుభవాలను పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముచ్చర్ల మునీందర్ రెడ్డి, డైరెక్టర్ బేతి భూమయ్య, అట్ల శ్రీనివాస్ రెడ్డి, ఉప్పల శ్రీనివాస్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, పాఠశాల ఇన్చార్జులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.