Grand Graduation Day at Gautam Model School
గౌతమ్ మోడల్ స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే
చిన్నారుల విజయానికి ఘన సత్కారం
ముఖ్య అతిథులుగా డీఎస్పీ రాంబాబు, అకాడమిక్ కోఆర్డినేటర్ శివకుమార్
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-
కొండాపూర్లోని గౌతమ్ మోడల్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. పాఠశాల విద్యార్థులు తమ తొలి విద్యా మెట్టును అధిరోహించి పై తరగతులకు వెళ్తున్న తరుణంలో నిర్వహించిన ఈ వేడుక కంటికి పండువగా సాగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డీఎస్పీ రాంబాబు మాట్లాడుతూ.. చిన్నారులకు చిన్న వయసులోనే ఇటువంటి ప్రోత్సాహకాలు అందించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, క్రమశిక్షణతో కూడిన విద్యతోనే గొప్ప భవిష్యత్తు సాధ్యమని పేర్కొన్నారు. అకాడమిక్ కోఆర్డినేటర్ శివకుమార్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమగ్ర వికాసానికి పాఠశాల యాజమాన్యం తీసుకుంటున్న శ్రద్ధను కొనియాడారు.పాఠశాల ప్రిన్సిపాల్ శ్రావంతి మరియు పీపీటీ ఇన్చార్జ్ నళిని కొండ సమక్షంలో విద్యార్థులకు పట్టాలు మరియు ప్రశంసా పత్రాలను అందజేసి ఘనంగా సత్కరించారు. తమ పిల్లల తొలి విజయాన్ని చూసి తల్లిదండ్రులు ఎంతో గర్వంగా, ఆనందంగా భావించారు. ఈ వేడుకలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
