శ్రీ చైతన్య స్కూల్లో గ్రాడ్యుయేట్ డే
ముఖ్య అతిథులుగా పాల్గొన్న మహబూబాబాద్ ఎమ్మెల్యే డా” భూక్య మురళి నాయక్, డి సి సి అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి
పిల్లలని దయచేసి బెట్టింగ్ యాప్ లకు దూరంగా ఉంచండి…
సెల్ ఫోన్ లకు పిల్లలని దూరంగా ఉంచండి
విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు
కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి
విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి క్రమశిక్షణ పాటిస్తూ భవిష్యత్తులో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ ఆకాంక్షించారు. స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ఐ ఎన్ టి ఎస్ ఓ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. నేషనల్ టాలెంట్ టెస్ట్ ఒలంపియాడ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులను ఆయన అభినందించారు విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఆయన బహుమతి ప్రధానం చేశారు. ఈ పరీక్షలో ప్రథమ స్థానంలో నిలిచిన మూడవ తరగతి విద్యార్థిని ఏ లాస్య ఫిరోజ్ ఖాన్ అద్వైత రోషిత విక్రం ములకు గోల్డ్ మెడల్ సర్టిఫికెట్లు అందజేశారు లాస్యకు లాప్టాప్ అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. తొమ్మిదవ తరగతిలో అత్యున్నత ప్రదర్శన కనపరిచిన అల్లం పైవ్యశ్రీ వచన పల్లి చేత్రాలకు గోల్డ్ మెడల్ ప్రశంస పత్రాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపిస్తే అది తల్లిదండ్రుల బాధ్యత అన్నారు. విద్యార్థులు సెల్ఫోన్లకు దూరంగా ఉండాలని ఆయన కోరారు సెల్ఫోన్లకు అలవాటు పడిన విద్యార్థులు భవిష్యత్తులో బెట్టింగులకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. తను కూడా విద్యార్థి దశలో ఇలాంటి పరీక్షల్లో 12,000 స్కాలర్షిప్ ను పొందిన విషయాన్ని గుర్తు చేశారు. తన విద్యార్థి జీవితాన్ని నెమరు వేసుకున్నారు పోటీ పరీక్షలకు వంద మంది విద్యార్థులు హాజరైతే 85 మంది విద్యార్థులు విజయం సాధించడం అభినందనీయం అన్నారు ప్రిన్సిపాల్ కోలా రామదాసు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చంద్రారెడ్డి, మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి బండారి వెంకన్న , మాజీ టి పి సి సి సభ్యులు దాసురు నాయక్, ఆయుఃఖాన్, వేముల శ్రీనివాస్ రెడ్డి,సుధాకర్ కోమల వెంకట్ రెడ్డి రాజేష్ కుమార్ సుమన్ అర్చన మౌనిక నూర్జహాన్ శ్రావణి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.