# మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్
# నూతనంగా ఎన్నికైన గౌడ ఎస్సై,కానిస్టేబుల్, ఏఎంసి డైరెక్టర్ లకు మోకుదెబ్బ అధ్వర్యంలో ఘన సన్మానం
నర్సంపేట,నేటిధాత్రి :
గౌడ కులస్తులు అన్ని రంగాల్లో రానించాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు.గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ అధ్వర్యంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పోటీ పరీక్షల్లో నూతనంగా ఎన్నికైన ఎస్సై,కానిస్టేబుల్,వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లుగా ఎంపికైన పలువురికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు.జిల్లా అధ్యక్షుడు గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్ అధ్యక్షతన నర్సంపేట పట్టణంలోని ఎస్ అర్ ఒకేషనల్ కళాశాలలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ముఖ్య అతిథులుగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంతుల రమేష్ గౌడ్,జాతీయ ప్రచార కార్యదర్శి గుళ్లపెల్లి ఉమెందర్ గౌడ్,నర్సంపేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు.ఐక్యతతో ఉంటేనే హక్కులను సాదించికోవచ్చని తెలిపారు.ఎస్సై,కానిస్టేబుల్,ప్రభుత్వ నామినేటెడ్ పదవులల్లో సెలక్ట్ ఐనా గౌడ కులస్తులు మరింత ఉన్నత పదవులు చేపట్టాలని ఆశాభావం వ్యక్తంచేశారు.ఇటీవల
నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఎంపికైన దాసరిపల్లి గ్రామానికి చెందిన వల్లాల కర్ణాకర్ గౌడ్,ఎస్సైగా దుగ్గొండి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన బూర రఘుపతి గౌడ్,కానిస్టేబుల్ లుగా ఎంపికైన ఖానాపురం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్ళు మర్ధ ప్రత్యూష గౌడ్,మర్ధ వినూష గౌడ్,నర్సంపేట మండలం రాజుపేటకు చెందిన తండ
కావ్యశ్రీ గౌడ్, గరిజాలకు చెందిన జనగాం వినయ్ గౌడ్,దుగ్గొండి మండలం మహమ్మాదాపురంకు చెందిన పంజాల అభిరాం గౌడ్,రాజుపేటకు చెందిన కోతి జగన్ గౌడ్,దుగ్గొండి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన తడుక గణేష్ గౌడ్,చెన్నారావుపేట మండలం సూరిపెల్లికి చెందిన కక్కెర్ల సారంగం గౌడ్,నర్సంపేట పట్టణానికి చెందిన కొంకీస అజయ్ గౌడ్ లకు శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి గొడిశాల సదానందం గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గ్రంథాలయ సంస్థ వరంగల్ జిల్లా డైరెక్టర్ గంప రాజేశ్వర్ గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్ గౌడ్, నర్సంపేట డివిజన్ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర నాయకులు మచ్చిక రాజు గౌడ్, మచ్చిక నర్సయ్య గౌడ్,జిల్లా నాయకులు జూలూరి హరిప్రసాద్ గౌడ్,దొంతి సంతోష్ గౌడ్, బొడిగె మల్లేశం గౌడ్, కొయ్యడి సనత్ గౌడ్,మర్ధ గణేష్ గౌడ్, నర్సంపేట పట్టణ అధ్యక్షుడు గండి యాదగిరి గౌడ్,ఖానాపురం మండల అధ్యక్షుడు గంగాధర్ గౌడ్,గంప రామకృష్ణ గౌడ్,జనగాం మల్లిఖార్జున్ గౌడ్,గోదిషాల అశోక్ గౌడ్,సర్పంచ్ గోడిషాల రాంబాబు గౌడ్,పలువురు గౌడ కులస్తులు పాల్గొన్నారు.