గీత కార్మికులకు 10 లక్షలతో గౌడ బందు అమలు చేయాలి.

మోకుదెబ్బ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి రమేష్ గౌడ్

నల్లబెల్లి, నేటి ధాత్రి:

గీత కార్మికులకు 10 లక్షలతో గౌడ బందు అమలు చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల రమేష్ గౌడ్ తెలిపారు. నల్లబెల్లి మండల కేంద్రంలో మోకుదెబ్బ మండల కమిటీ సమావేశం మండల అధ్యక్షులు పెరుమాండ్ల రాజ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన బుధవారం ఏర్పాటు చేయగాఈ సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన రమేష్ గౌడ్ మాట్లాడుతు రాష్ట్రంలో అరవై లక్షల జనాభా కలిగిన గౌడ కులస్థులకు రాజకీయ అవకాశాలు కల్పించడంలో పాలకులు విఫలమైనారని ఆరోపించారు. తెలంగాణా ఉద్యమంలో ముందు వరుసలో ఉన్న గౌడ కులస్థులకు రాష్ట్రం సిద్దించ్చాక చట్ట సభలో సరైన ప్రాతినిధ్యం కల్పించక పోవడం సో చనీయమన్నారు. గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలు, సేఫ్టీ మోకులు, గౌడ బందు ఇస్తామని వాగ్దానం చేసిన ప్రభుత్వం నేటికీ అమలు చేయలేదన్నారు. ప్రమాదవషాత్తు మరణించిన గీత కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా 10 లక్షలు ఎక్స్ గ్రేషియా వెంటనే విడుదల చేయాలని, జివో నెంబర్ 560 ప్రకారం ప్రతి గౌడ సొసైటీకి 5 ఎకరాలు స్థలం కేటాయించాలని,18 సంహాత్సరాలు నిండిన గౌడ యువతకు గీత కార్మిక సభ్యత్వం ఇవ్వాలని, గీత వృత్తిని ఆధునికరంచాలని, త్వరలో జరుగబోయే శాసన సభ ఎన్నికలలో కుల దామాషా ప్రకారం ఎమ్మెల్యే స్థానాలు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం మండలంలోని నందిగామ గ్రామానికి చెందిన జునూరి నరేష్ గౌడ్ ను జిల్లా ప్రచార కార్యదర్శి గా నియమించినట్లు ఆయనతెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకన్న గౌడ్, ముంజాల రాజేందర్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గౌడ్,నాయకులు రామగోని సుధాకర్ గౌడ్, మచ్చిక రాజు గౌడ్,గంప రాజేశ్వర్ గౌడ్, మద్దెల సాంబయ్య గౌడ్, మచ్చిక నర్సయ్య గౌడ్, జూలూరి హరిప్రసాద్ గౌడ్, దొంతి సంతోష్ గౌడ్, పంజాల వెంకట్ గౌడ్, కల్లెపు వెంకట్ గౌడ్, గండి యాదగిరి గౌడ్, ఎరుకొండ సదా నందం గౌడ్, మచ్చిక రవి గౌడ్, నాగపూరి రమేష్ గౌడ్,గాజర్ల రాజమల్లు గౌడ్,ఆనందం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!