క్రికెట్ టోర్నీని,టాస్ వేసి ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్
జగిత్యాల నేటి ధాత్రి
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజక వర్గం ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలోని నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే క్రికెట్ టోర్నీని బుధవారం రోజున ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ టాస్ వేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఇరు జట్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ధర్మపురి నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నీలో పాల్గొనే ప్రతి ఒక్క క్రీడాకారుడికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని, క్రీడాకారులను ప్రోత్సహించే విషయంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందని,క్రికెట్ నిర్వహణలో ఎటువంటి సహాయ సహకారాలు అవసరం ఉన్న తన దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,