చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం సనుగుల గ్రామంలోని శ్రీ గోవిందరాజుల స్వామి వారి కల్యాణ మహోత్సవం లో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు..
ఇంటి ఇలావేల్పు అయిన శ్రీదేవి భూదేవి సమేత గోవింద రాజుల స్వామీ వారు భక్తుల కోరిన కోర్కెలు తీర్చే వారని అన్నారు..
స్వామి వారి కృప కటాక్షాలు ప్రజలపై ఉంటూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో సంతోషంగా ఉండాలని అన్నారు..
అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.