
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ధాన్యం అమ్ముకొండి
కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం
రైతుల కు పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే
ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్
మరిపెడ నేటిధాత్రి.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని మరిపెడ, అబ్బాయిపాలెం, చిల్లంచర్ల, రాంపూరం గ్రామంలో సోమవారం పీ.ఏ.సీ.ఎస్,స్వయం సహాయక సంఘాల ( జీవన జ్యోతి ధాన్యం కొనుగోలు కేంద్రం, రాంపురం) ఆధ్వర్యంలో వరి దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్, డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యుడు డాక్టర్ రామచంద్రనాయక్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తక్కువ ధరకు దళారులకు వరి దాన్యం విక్రయించి రైతులు మోసపోవద్దన్నారు. నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ కొనుగోలు కేంద్రాల్లో దాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు. 2024 – 25 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కనీస మద్దతు ధర క్వింటాల్ కు గ్రేడ్ “ఏ” రకానికి రూ, 2320 లుగా, సాధారణ రకానికి రూ, 2300 లుగా మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందన్నారు,సన్నరకం, దొడ్డు రకం, కేంద్రాలలో రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తూ కొనుగోలు చేపట్టాలని, రైతు యొక్క ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, తదితర అంశాలను ఆన్లైన్లో వెంటనే నమోదు చేయాలని సూచించారు,వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు మ్యచ్ఛర్, వచ్చే విధంగా ఎలా చర్యలు తీసుకోవాలో అవగాహన కల్పించాలన్నారు, ప్రభుత్వ సూచనల మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సెంటర్ నిర్వాహకులు నిర్వహించాలని ఆదేశించారు,ధాన్యం కొనుగోల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు, రైస్ మిల్లర్లు సహకరించాలని, దాన్యం తేమ శాతం 17 ఉండే విధంగా, చెత్త, తాలు, మట్టి పెల్లలు, రాళ్లు పాడైపోయిన, రంగు మారిన, మొలకెత్తని, పురుగు తిన్న దాన్యం, పూర్తిగా తయారు కానీ, ముడుచుక పోయిన దాన్యం, తక్కువ రాకములు మిశ్రమం లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిఏసిస్ చైర్మన్ చాపల యాదగిరి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వంటికొమ్ము యుగంధర్ రెడ్డి,పెండ్లి శ్రీనివాస్ రెడ్డి,మాజీ వైస్ ఎంపిపి నర్సింహరెడ్డి, గంధసిరి అంబరిశ,మాజీ సర్పంచ్ రామ్ లాల్,గుగులోత్ రవి నాయక్,వ్యవసాయ శాఖ ఏడీఏ విజయ చంద్ర, ఏఒ వీర సింగ్,ఏపియం రాములు, ఏఈఒ సందీప్,మండల తాసిల్దార్ సైదులు,గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామ సహాయం జయపాల్ రెడ్డి,పసుపులేటి యాదగిరి,కంసాని వెంకన్న,సుదగని శ్రీను,బోరా హరీష్,రాంపెల్లి శ్రీను,కొమ్ము వెంకన్న,చింతపల్లి గణేష్, సెంటర్ నిర్వాహకులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.