నీటి విషయంలో గత ప్రభుత్వ అన్యాయాలపై, శ్వేత పత్రం విడుదల చేస్తాం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల నేటి ధాత్రి
నీటి విషయంలో గత ప్రభుత్వ అన్యాయాలపై శ్వేత పత్రం విడుదల చేస్తామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు,అసెంబ్లీ సమవేశాల్లో భాగంగా బుధవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు సభలో మొదటి సారిగా ప్రసంగించారు.ఈ సందర్భంగా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులైన హరీష్ రావు,కెటిఆర్ మాట్లాడే ధోరణి నీ తప్పుపట్టారు,రాష్ట్ర ముఖ్యమంత్రి,మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్న సభలో వారిని ఉద్దేశించి ఏక వచనంతో మాట్లాడటం చాలా బాధాకరమని,కాళేశ్వరం నీటినీ మేడారం,మిడ్ మనేరు ద్వారా సిరిసిల్లకు,సిద్దిపేటకు,గజ్వేల్ కి తీసుకెళ్లారు కానీ మా ప్రాంతానికి మాత్రం నీటినీ ఇవ్వలేదని,ధర్మపురి నియోజకవర్గానికి రిజర్వాయర్ ఏర్పాటు చేస్తామని,దానికి పత్తిపాక రిజర్వాయర్ అని పేరు పెడతాం అని చెప్పిన ఇదే ఒక్కప్పటి మంత్రి హరీష్ రావు గారు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ద్వారా ప్రకటన చేయించడం జరిగిందనీ,దాన్ని కూడా పక్కన పెట్టీ కాళేశ్వరం లింక్ 2 పేరుతో మా ప్రాంతానికి చెందిన సుమారు 17వందల ఎకరాల భూములను బలవంతంగా,లాకున్నరని,మేము రైతాంగం పక్షాన పోరాటం చేస్తే మా పై అక్రమంగా కేసులు పెట్టడం జరిగిందని,కరీంనగర్ జిల్లాకు నీటి విషయంలో గత ప్రభుత్వం చేసిన, అన్యాయాలపై మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో శ్వేత పత్రం విడుదల చేస్తామని,కృష్ణ జలాలపై స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటన చేసిన తర్వాత దానిపైన మాట్లాడే అవసరం లేదని,రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ఎక్కడ అమలు చేస్తుందేమో అని భయపడి ఈ విధంగా సభను తప్పుదోవ పట్టించడం జరుగుతుందని,వారు చెప్పే కల్లబొల్లి మాటలు రాష్ట్ర ప్రజలు విని నమ్మే స్థితిలో లేరని ఈ సందర్భంగా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *