మాక్కూడా ఉపాధి చూపించండి అని టాటా ఏసీ డ్రైవర్ల , ఓనర్ల ఆవేదన!!!!
ఎండపల్లి (జగిత్యాల) నేటి ధాత్రి
ధర్మపురి నియోజకవర్గంలోని ఎండపల్లి మండలంలో ప్రెస్ మీట్ యూనిట్ సభ్యులు పాల్గొని సమావేశం ఏర్పాటు చేసి టాటా ఏసీ యూనియన్ సభ్యులు , మాట్లాడుతూ,తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రభుత్వం ప్రకటించడంతో మా బతుకు తెరువు దెబ్బతింటుందని,మరొక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకం ల్లో లో బాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం పై ప్రభుత్వం పునరాలోచించాలని, టాటా ఏసీ యూనియన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ధర్మపురి నియోజకవర్గంలోని ఎండపల్లి మండలం ఆనుకొని వెల్గటూర్, ధర్మారం మండలాల్లో సుమారుగా 180 టాటా ఏసీలు నడుపుకునే డ్రైవర్లు రోడ్లపై పడే పరిస్థితి ఏర్పడింది, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభించక ముందు ప్రయాణికులతో సుమారుగా రోజుకు 500 రూపాయలు మా కుటుంబాలని పోషించుకునే అవకాశం ఉండేది, కానీ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు చేశాక, ఇప్పుడు ఆ పరిస్థితి లేక పొగ, మా కుటుంబాల రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది, కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఆదుకోవాలని ,ఆవేదన వ్యక్తం చేస్తున్నారు,ఈ కార్యక్రమంలో టాటా ఏసీ డ్రైవర్ మరియు ఓనర్స్ యూనియన్ ధర్మారం వెల్గటూర్, రాయపట్నం, యూనియన్ , అధ్యక్షులు ఎనగందుల శ్రీనివాస్ ఉపాధ్యక్షులు చల్లూరి మధు కోశాధికారి మడ్డి మహేష్ మరియు ధర్మారం అధ్యక్షులు జక్కుల బాబు ఉపాధ్యక్షులు వేల్పుల మల్లేశం కోశాధికారి కనక రాజమౌళి వెల్గటూర్ అధ్యక్షులు మూగల శ్రీనివాస్ ఉపాధ్యక్షులు పిట్టల సంతోష్ కోశాధికారి సిలివేరి సత్యం తదితరులు పాల్గొన్నారు
మా బతుకు దెరువు ఎట్లా ? మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకం పై ప్రభుత్వం పునరాలోచించాలి!!
