
*నాంపెల్లి, అగ్రహారంలో స్వామివారి దర్శనం
*భజనలు.. భక్తిగీతాలు.. వన బోజనాలతో బిజీ బిజీ
వేములవాడ, నేటిదాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ వృద్ధుల ఆశ్రమం వృద్దులు రోజంతా ఉల్లాసంగా. ఉత్సాహంగా గడిపారు. ఆశ్రమం నుంచి వెళ్లి అందరూ కలిసి
భజనలు. భక్తిగీతాలు. వన బోజనాలతో బిజీ బిజీగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూచన మేరకు, కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాలతో ప్రభుత్వ వృద్ధుల ఆశ్రమం మండేపల్లి, ఎల్లారెడ్డిపేట నుంచి వృద్ధులను నాంపల్లి గుట్ట పై గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి బుధవారం తీసుకెళ్లారు. ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం హాజరై వృద్ధులతో కలిసి వనభోజనాలు చేశారు. అలాగే వృద్ధులకు లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అర్చకులు ఆశీస్సులు అందించారు. అగ్రహారంలోని ఆంజనేయస్వామి టెంపుల్ లో కూడా వారికి దర్శనం చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం నాంపల్లి గుట్ట సమీపంలోని ఎల్లమ్మ దేవాలయం దగ్గర వన భోజనాలు ఏర్పాటు చేశారు. భగవంతుడి సన్నిధానానికి వెళ్లడం ఎంతో ఆనందాన్నిచ్చిందని వృద్దులు చెప్పారు. అలాగే గుట్ట పైన ఉన్న పర్యాటక ప్రదేశంలోని ప్రతిమలను నాగసర్పం మొదలైన వాటిని చూసి ఆనందించారు. ఈ సందర్భంగా వారు భజనలు, కీర్తనలు, భక్తి గీతాలు పాడారు. వారంతా చాలా ఆనందించారు.
కలెక్టర్ కు కృతజ్ఞతలు
తమకు వసతి, అన్ని సౌకర్యాలు కల్పిస్తూ తమకు అండగా ఉంటున్న ప్రభుత్వానికి వృద్దులు ధన్యవాదాలు తెలియజేశారు. తమ ఆశ్రమాల పై ప్రత్యేక శ్రద్ద చూపిస్తూ, సౌకర్యాలు కల్పిస్తున్న కలెక్టర్ అనురాగ్ జయంతికి కృతజ్ఞతలు తెలిపారు. తమకు సినిమా, విహార యాత్ర అవకాశం కల్పించారని వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ వయోవృద్ధుల ఆశ్రమం సూపరిండెంట్ మమత, అసిస్టెంట్ సూపర్డెంట్ వెంకటేష్, కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ అరుణ్, భాస్కర్ రావు, తదితరులు పాల్గొన్నారు.