గోవింద్ పూర్ సర్పంచ్ ను సన్మానించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం..
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మండలం గోవింద్ పూర్ గ్రామం నూతనంగా సర్పంచ్ గా ఎన్నికైన కవిత వెంకట్ పార్టీ నాయకులతో ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారిని మర్యాద పూర్వకంగా కలువగా గెలిచిన సర్పంచ్ కవిత వెంకట్ ను,వారి గెలుపుకు కృషి చేసి గెలిపించిన మాజీ సర్పంచ్ ల ను పార్టీ నాయకులను శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు, గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటు గ్రామ అభివృద్ధికి కృషి చేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరారు,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు నర్సింలు, రాజు,ఆర్.రాజ్ కుమార్, చెంద్రయ్య,మాజీ ఉపసర్పంచ్ ఖలీల్,గ్రామ పార్టీ అధ్యక్షులు వీర్ శెట్టి,రమేష్, సుభాష్,తిరుమల్,తదితరులు ఉన్నారు,
