తరలి వచ్చిన సనప వంశీ యులు
భక్తులతో పులకించి పోయిన శేట్టుపల్లి గ్రామం
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
గుండాల మండలం శెట్టిపల్లి లో సనప వంశీయుల గోవిందరాజు జాతర అత్యంత వైభవంగా జరిగింది . ఈ జాతర 20,21,22 న బుధ,గురు,శుక్ర వారాలలో జాతర కార్యక్రమాలు వడ్డేలు తలపతులు తో జరుగు తాయని జాతర నిర్వాహకులు తెలియజేశారు.
20 న బుదవారం ఉదయం 8 గంటలకు దేవాలయ శుద్ది ,మంగళ వాయిద్యాలతో తోరణ భందన ,
21 న గురువారం ఒక్క పొద్దులో దేవుని గద్దెల పైకి తీసుక వచ్చుట,ఊరేగింపుగా తీసుకొని వస్తారనీ అన్నారు.22న మొక్కులు చెల్లించుకుంటారని అన్నారు.
ఈ జాతరకు వివిధ ప్రాంతాలనుండి సనప వంశం వారు, వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోవిందరాజు దేవుని ఆశిషులు పొందారు. ఈ జాతర సందర్భంగా యువతకు వాలీ బాల్ పోటీలు నిర్వహించారు. క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తలపతి సనప రాంబాబు, సనప స్వామి, సనప రాంచందర్, సనప శ్రీను, సనప జగ్గారావు, సనప కృష్ణ, సనప సుధాకర్, సనప నాగేశ్వర రావు,వడ్డే కల్తీ సర్వయ్యా, శెట్టిపల్లి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.