ఆదివాసీలను అభివృద్ధి చేయడం లో ప్రభుత్వాలు అలసత్వం వీడాలి.

” తుడుందెబ్బ “
కొత్తగూడ, నేటిధాత్రి :

భారత దేశ మూలవాసులుగా పిలవబడే ఆదివాసులను 75 ఏళ్ల స్వాతంత్ర భారాతావని లో అభివృద్ధి చేయడం లో కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వ ధోరణి తో నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆదివాసీ హక్కుల పోరాట సమితి “తుడుందెబ్బ “తీవ్రంగా విమర్శిస్తుంది బుధవారం రోజు కొత్తగూడ మండల కేంద్రంలో ని గ్రామ పంచాయితీ ఆవరణలో అలెం జంపయ్య అధ్యక్షతన జరిగిన సమావేశం లో రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి ఆగబోయిన రవి పాల్గొని మాట్లాడుతూ అటవీ ప్రాంతం లో ఆవాసాలు ఏర్పాటు చేసుకొని దుర్భర జీవితాలను గడుపుతున్న ఆదివాసీలను ఓటుబ్యాంక్ గా మాత్రమే వినియోగించుకుంటూ వారి యోగ క్షేమాలను పట్టించుకోకుండా కేoద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలను ఏ రంగం లోను అభివృద్ధి చేయకుండా కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తూ అడవిబిడ్డలకు విద్యా,వైద్యం అందాలంటే ఆదివాసీ ప్రజలు రోడ్ల సదుపాయం కల్పన లేనందున కాళీ దారుల్లో వాగులు వంకలు దాటి పోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి దాపూరించడం సిగ్గుచేటని ఈ ప్రభుత్వాలు ఆదివాసీల పట్ల ఇంత దాటుమమైన రీతిలో వ్యవహరించడం అమానవీయమని భారత రాజ్యాంగం లో ఆదివాసీలకు ఉండబడిన షెడ్యూల్ ప్రాంత హక్కులను,చట్టాల అమలు చేయాల్సిన ప్రభుత్వాలు నిసిగ్గుగా కళ్ళు మూసుకొని చట్టాలు ఉల్లo గన చేసే దోపిడీ దారులకు వంత పాడుతున్నాయని ఆదివాసీ సమాజం ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టే దిశగా తమ కోసం , విద్యా,వైద్యం,రోడ్లు,వ్యవసాయ,అభివృద్ధి కి దగ్గర కావడం కోసం ప్రభుత్వల పై పోరాటాలు చేసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు సమావేశం లో సిద్దబోయిన ఉపేందర్,పులసం మునేష్,పినబోయిన యాకయ్య, వజ్జ శ్రవణ్,లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *