CPI Demands Full Implementation of Indian Constitution on Ambedkar Jayanti
భారత రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు పూర్తిగా అమలు చేయాలి
సిపిఐ పట్టణ కార్యదర్శి సొతుకు.ప్రవీణ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్. బి ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని కొమరయ్య భవన్ లో నిర్వహించుకోవడం జరిగింది. సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు.ప్రవీణ్ కుమార్ కమిటీ సభ్యులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాదని మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయడానికి ఆర్ఎస్ఎస్ తో కలిపి కుట్ర చేస్తుందని తెలిపారు. భారత రాజ్యాంగం పట్ల పౌరులు అందరు అవగాహన చేసుకోలని కోరారు. భారతరత్న అంబేద్కర్ కృషితోనే రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు, నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు, అందరికీ ఓటు హక్కు, పురుషులతో సమానంగా మహిళలకు ఉద్యోగ,రాజకీయ హక్కులను తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.అంబేద్కర్ కృషి వల్లనే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసి మైనారిటీ వర్గ ప్రజలకు న్యాయం చేకూరిందని తెలిపారు.అంబేద్కర్ ఆశ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు క్యాతరాజు సతీష్,నేరెళ్ల జోసెఫ్,వేముల శ్రీకాంత్, యాదగిరి, ఎండి అస్లాం, పీక రవి,గోలి లావణ్య,పొనగంటి లావణ్య,పల్లెర్ల రజిత, పెద్దమాముల సంధ్య, మట్టి నాగమణి, మేద్రపు సుభద్ర తదితరులు పాల్గొన్నారు.
