
ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తుంది..
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందిస్తాం…
కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి..
మూతపడిన ప్రభుత్వ పాఠశాల రీఓపెన్ చేసిన మంత్రి వివేక్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తుంది అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.22 సంవత్సరాల క్రితం రామకృష్ణాపూర్ పట్టణంలోని కాకతీయ కాలనీలోని మూతపడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ను శనివారం కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి రీ ఓపెన్ చేశారు.
మూతపడిన పాఠశాలను రీఓపెన్ చేయించేందుకు కృషిచేసిన స్థానిక కాంగ్రెస్ నాయకుడు పాల రాజును మంత్రి సన్మానించారు.అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్ద పీట వేస్తుందని అందులో భాగంగానే మూతపడిన పాఠశాలలను రీ ఓపెన్ చేస్తున్నామని అన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అర్హులైన వాళ్లందరికీ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి రేషన్ కార్డులు అందించారు.
రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని అన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు కూడా అందించలేదని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు అందిస్తుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందించామని, ఇందిరమ్మ ఇండ్లు సైతం నిర్మించుకునేందుకు సొంత స్థలం కలిగిన వారు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, మందమర్రి ఎంఈఓ దత్తమూర్తి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, పీసీసీ సభ్యులురఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, గోపతి రాజయ్య ,మాజీ చైర్ పర్సన్ జంగం కళ, మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.