అడ్లూరి లక్ష్మణ్ కుమార్
గొల్లపల్లి నేటి ధాత్రి: జగిత్యాల జిల్లా
గొల్లపెల్లి మండలం వెనుగుమట్ల, బొంకుర్,అబ్బాపూర్, గొల్లపెల్లి,శ్రీరాముల పల్లి గ్రామాల్లో సోమవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించి ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ కింద మంజూరు అయిన పలు సిసి రోడ్లకు సంబందించిన పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం వెనుగుమట్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలకు సంబంధించిన పలు సమస్యలను యజమాన్యం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి అట్టి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు..
ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
ధర్మపురి నియోజకవర్గ ప్రజలు తమను ఆశీర్వదించి ఈ ప్రాంత ఎమ్మెల్యే గా తనను గెలిపించడం జరిగిందని,కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలలో రెండింటినీ అమలుచేయడం జరిగిందని,మరో రెండు గ్యారంటీలైన 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్,200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి హామీలకు క్యాబినేట్ ఆమోదం తేలపడం జరిగిందని,వాటిని త్వరలోనే అమలుచేస్తామని,గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ ఈ ప్రాంత ప్రజల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని,మేడారం రిజర్వాయర్,కాళేశ్వరం లింక్ 2 ద్వార ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించే ఆలోచన కూడా గత ప్రభుత్వ నాయకులకు లేదని,కానీ మా ప్రభుత్వంలో ప్రతి రైతును ఆదుకుంటామని,ఈ ప్రాంతలోని చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని,ప్రతి గ్రామ గ్రామాన నేనే స్వయంగా వెళ్లి ప్రతి ఒక్కరి సమస్యలను తెలుసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు..
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.