చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం మల్యాల గ్రామంలో గత పది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన నుల్గొండ సత్తవ్వ కుటుంబాన్ని గురువారం రోజున ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరామర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ చాలా దగ్గరి సంబంధమైన మల్యాల గ్రామానికి చెందిన నుల్గొండ సత్తవ్వ మృతి చెందడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. వీరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈసరి శ్రీనివాస్, మల్లారపు రాజయ్య, పంచెరుపుల దేవలింగు, ఫోంచెట్టి వెంకటేష్, కొట్టే కిష్టయ్య, కాసర్ల వెంకటి, ఫోంచెట్టి తిరుపతి, మల్లారపు కిషన్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.