నేటిధాత్రి, మరిపెడ.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని రాంపురం గ్రామపంచాయతీలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెండ్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ చేశారు. రాంపురం జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, నోట్ బుక్స్, పెన్సిల్లు, పెన్నులు, స్కేల్ లు ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్ చేతుల మీదుగా విద్యార్థులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో మరిపెడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి త్రివేణి, పెండ్లి శ్రీనివాస్ రెడ్డి, రామ సహాయం విష్ణువర్ధన్ రెడ్డి, ధోని పెళ్లి కృష్ణ రాంపూర్ గ్రామస్తులు, స్కూల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.