
*ఎదురుగా వస్తున్న లారీని తప్పించ బోయి బోల్తా పడ్డా కారు!!!
త్రుటిలో తప్పిన ప్రమాదం!!
ఎండపల్లి, నేటి ధాత్రి
ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూ రి లక్ష్మణ్ కుమార్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది స్వల్ప గాయాలతో త్రుటిలో ప్రాణాలతో బయట పడ్డ సంఘటన చోటు చేసుకుంది సోమవారం తెల్లవారుజామున ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది ఈ ప్రమాదంలో అడ్లూ రీ,లక్ష్మణ్ కుమార్ కు ప్రాణాపాయం తప్పింది ఆదివారం వెళ్లిన విప్ తిరిగి వస్తున్న సందర్భంలో జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబర్ పేట మూలమలుపు వద్ద వరంగల్ రాయపట్నం రాష్ట్ర రహదారిపై వాహనం ప్రమాదానికి గురైంది వెల్గటూర్ వైపు నుంచి ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి విప్ వాహనం బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఆయనతోపాటు అంగరక్షకులకు స్వల్ప గాయాలయ్యాయి ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానిక ఎస్సై ఉమాసాగర్ ఘటన స్థలానికి చేరుకొని ప్రభుత్వ విప్ తో పాటు మిగిలిన వారిని హుటాహుటిన కరీంనగర్ అపోలో ఆసుపత్రికి తరలించాలని ఆయనకు ప్రాణాపాయం లేదని స్వల్ప గాయాలయ్యాయని డాక్టర్ తెలపగా మెరుగైన వైద్య నిమిత్తం హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం, ఇది ఇలా ఉండగా మా నాయకుడు చల్లగా ఉండాలని,ధర్మపురి ప్రజానీకం, అభిమానులు మాత్రం దేవుళ్ళను వేడుకుంటున్నారు